ఐపీఎల్ టీమ్ బరిలో అదానీ, గొయెంకా..

ఐపీఎల్ టీమ్ బరిలో అదానీ, గొయెంకా..

న్యూఢిల్లీ: ఐపీఎల్ టోర్నీలోకి  ఒకటి లేదా రెండు కొత్త జట్లను తీసుకునేందుకు బీసీసీఐ సుముఖంగా ఉండడంతో టీమ్ ల బరిలోకి దిగేందుకు హేమాహేమీలు రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రధాని మోడీ, అమిత్ షాలకు సన్నిహితుడైన అదానీతోపాటు గొయెంకా, మరో ప్రముఖ బ్యాంకు కూడా బరిలోకి దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ టీమ్ ల బరిలో గుజరాత్, లక్నో, పుణె కేంద్రాలుగా ఒకటి లేదా రెండు కొత్త ఐపీఎల్‌ టీమ్‌లను బీసీసీఐ ఖరారు చేయనున్న విషయ తెలిసిందే. అహ్మదాబాద్‌, పుణె స్టేడియాలకు ఛాన్స్ ఉండడంతో బిడ్లను ఇప్పటికే బీసీసీఐ ఆహ్వానించింది. వచ్చేనెల 5వ తేదీ వరకు బిడ్ల దరఖాస్తులను బీసీసీఐ విక్రయిస్తుంది. వచ్చేనెల 17తేదీన కొత్త బిడ్లను  ఖరారు చేయనుంది. బిడ్ల కోసం అదానీ, ఆర్‌పీజీ సంజీవ్‌ గోయెంకాతో పాటు టొరెంట్ ఫార్మా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వీరితోపాటు  ప్రముఖ బ్యాంక్‌ కూడా కొత్త టీమ్‌పై ఆసక్తి చూపుతున్నట్లు బీసీసీఐ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బిడ్డింగ్‌లో గెలిచిన కంపెనీలు 2022 సీజన్‌ నుంచి ఐపీఎల్ బరిలోకి దిగుతాయి.